GOA Budget Trip Plan

మనం గోవా టూర్ యొక్క పూర్తి సమాచారం తెలుసుకుందాం...... గోవా ఎలా వెళ్లాలి..? గోవా లో చూడవలసిన ప్రదేశాలు ఏంటి..? గోవా లో ఎక్కడ స్టే  చేయాలి..?                     


గోవా వెళ్లాలనుకునే వారికి ఈ టూర్ ప్లాన్....


 అందుకే ఈ టూర్ ప్లాన్ లో స్కూబా డైవింగ్ పేరాగలీడింగ్ సౌత్ గోవా నీ  కాలపాలేదు. అవీ కూడా 
 ఇంక్లూడ్ చేస్తే హై బడ్జెట్ అవుతుంది. 


 ముందుగా గోవా ఎలా వెళ్లాలో చూద్దాం. 



 గోవా మనం ఫ్లైట్ లో లేదా ట్రైన్లో వెళ్లొచ్చు హైదరాబాద్ నుంచి బస్ లు  కూడా ఉనాయి. 

  

ఇప్పుడు మనం గోవా కి ట్రైన్ లు ఎలా వెళ్లాలో చూద్దాం.. 


 హైదరాబాద్ నుంచి గోవా కి ఉన్న బెస్ట్ ట్రైన్ హైదరాబాద్ వాస్కో డీ గామా  వీక్లీ ఎక్స్ప్రెస్ ట్రైన్  నెంబర్ 17021 ఇది ప్రతి గురువారం హైదరాబాద్ నుంచి మార్నింగ్ 09:55 బయలుదేరుతుంది, నెక్స్ట్ డే మార్నింగ్ గోవాలో 05:15 కి చేరుకుంటుంది.. 


 హైదరాబాద్ నుంచి గోవా కి ఉన్న మరో ట్రైన్ కాచిగూడ వాస్కో డీ  గామా  ట్రైన్ ఇది  ప్రతి ఆది మంగళ బుధ  శుక్రవారాల్లో నైట్ 9 గంటలకి బయల్దేరుతుంది. నెక్స్ట్ డే మధ్యానం  3 గెంటలకి  కి గోవా చేరుకుంటుంది.




 సో ఈ టైంలో మీరు వెళ్ళట వల్ల వన్డే వేస్ట్ అయిపోతుంది అంతేకాకుండా వన్డే హోటల్ కాస్ట్ ఎక్స్ట్రా గా పడుతుంది వీలైనంతవరకు  ఈ ట్రైన్ అవాయిడ్ చేయండి. ఫస్ట్ ట్రైన్ ఏ ప్రిఫర్ చేయండి.  



వైజాగ్ నుంచి గోవా కి వెళ్లే ట్రైన్ అమరావతి ఎక్స్ప్రెస్ ట్రైన్ నెంబర్ 18047 ఇది ప్రతి మంగళ బుధ శుక్ర శనివారాల్లో ఉంటుంది విశాఖపట్నంలో 12:50 బయలురుతుంది, అదే విజయవాడలో సాయంత్రం 06:43  బయలుదేరుతుంది. 
 నెక్స్ట్ డే గోవా రెండు గంటలకు చేరుకుంటుంది. 
 ఈ టైంలో రావడం వల్ల మీకు వన్డే వేస్ట్ అవుతుంది. స్టేషన్ నుంచి హోటల్ రూమ్ కి వెళ్ళాక ఈవినింగ్ అయిపోతుంది.. 



 తిరుపతి నుంచి గోవా కి ట్రైన్ తిరుపతి వాస్కోడిగామా ఎక్స్ప్రెస్ ట్రైన్ నెంబర్ 17419  ప్రతి గురువారం తిరుపతిలో మార్నింగ్ 11:20 కీ  బయలుదేరుతుంది నెక్స్ట్  డే మార్నింగ్ గోవాలో 5:15  కి చేరుకుంటుంది. 

 ఎయిర్పోర్టు లేదా రైల్వే స్టేషన్ నుంచి కలన్గుటే బీచ్ ఎలా చేరుకోవాలో చూద్దాం.......



 ఎయిర్పోర్ట్ నుంచి 45 కీలవమేటర్స్  ఉంటుంది. మీరు టాక్సీ బుక్ చేసుకుంటే 1300 రూపీస్ చార్జి  చేస్తారు.  అదే బస్సులో వెళితే 70-200 రూపీస్. 


ఎయిర్పోర్ట్ నుంచి బయటకు వచ్చి హాఫ్  కిలోమీటర్లు నడిస్తే పనాజి కె బస్ లు అందుబాటులో ఉంటాయి, మరియు పనాజి  నుంచి 
కలన్గుటే కీ కూడా బస్ లు ఉంటాయి. ట్రైన్  లో వచ్చే వాళ్ళు మాడగో  రైల్వే స్టేషన్ లో దిగండి. రైల్వే స్టేషన్ నుంచి కొంచెం బయటకు వస్తే లోకల్ బస్ అవైలబుల్ గా ఉంటాయి.  మెయిన్ బస్టాండ్ వెళ్ళండి మెయిన్ బస్టాండ్ నుంచి పనాజీకి బస్సెస్ ఉంటాయా. పనాజీ నుంచి కలన్గుటే బీచ్ కి ఫుల్ బస్ లు ఉంటాయి. అదే మీరు టాక్సీలో వెళ్లాలంటే 1300 చార్జ్ చేస్తారు. 

గోవా లో  హోటల్ ఎక్కడ తీసుకోవాలో చూద్దాం.. 

 
కలన్గుటే & బాగా  బీచ్  మోస్ట్ హపనింగ్ ప్లేసెస్ అండ్  ఆల్ వాటర్ స్పోర్ట్స్ యాక్టివిటీస్ అండ్ బాగా బీచ్  నైట్ లైఫ్ కీ చాలా ఫేమస్ ఏ రెండు  పక్కనే ఉంటాయి.. సో మీరు దగ్గర్లో హోటల్ రూమ్ బుక్ చేసుకోండి. 


 లో సీజన్లో మినిమం 650 సీజన్లో మినిమం ₹1000 ఉంటాయి అంతకుమించి ఏ రేంజ్ లో హోటల్ తీసుకోవాలనేది మీ ఛాయిస్.. 


లోకల్ ప్లేస్ కవర్ చేయటానికి బైక్ రెంటల్స్  ఎలా ఉంటాయో చూద్దాం....



బైక్  కీ వీళ్ళు ఒక రోజు కి 400 నుంచి 600 చార్జి చేస్తారు,సీజన్ బట్టి. నేను చెప్పేది స్కూటీ కాస్ట్ మాత్రమే.. మనం ఏ  బైక్ తీసుకునం అనే దాన్ని బట్టే కాస్ట్ ఉంటుంది. అదే విధంగా సెల్ఫ్ డ్రైవింగ్ కార్స్ కూడా ఇస్తారు మీరే ఏకువ మంది  ఉంటే కారు బుక్ చేసుకోవచ్చు.. 


DAY 1 ఇన్ గోవా.... 


  ఫ్లైట్ దిగి లేదా ట్రైన్ దిగి పనాజీ చేరుకుని పనాజీ నుంచి కలన్గుటే  చేరుకుని హోటల్ చెక్-ఇన్ అవి బ్రేక్ఫాస్ట్ చేసే లోపు  10:30 అవుతుంది... 

కలన్గుటే బీచ్   దగ్గర్లోనే ఉంటుంది కాబట్టి ఆఫ్టర్నూన్ వరకు కలన్గుటే బీచ్  లోనే ఎంజాయ్ చేయండి. ఈ బీచ్  వాటర్ ఆక్టివిటీస్ కి చాలా ఫేమస్. ట్రై చేయండి. 

 ఆఫ్టర్నూన్ లంచ్ చేసి కొంచెం రెస్ట్ తీసుకుని,  నార్త్ గోవా లోనే బ్యూటిఫుల్ బీచ్ అయిన వెగటుర్   బీచ్ కి వెళ్ళండి.. 

 ఈ  బీచ్ దగ్గర్లో చిన్న కొండ  ఉంటుంది చాలా ఈజీగా వేకచ్చు .. ఈ కొండపై నుంచి వ్యూ  అద్భుతంగా ఉంటాయి... 




తరువాత  దగ్గర్లో చాపోరా ఫోర్ట్  ఉంటుంది నుంచి వ్యూస్స చాలా బాగుంటాయి , ఎస్పెషల్లీ ఈవినింగ్ సన్ సెట్   చాలా బాగుంటుంది మిస్ అవకండి.. 




ఆ ఫోర్ట్  నుంచి అంజనా బీచ్ కి వెళ్ళండి. అంజనా బీచ్ లో మీకు టైం ఉంట సస్పెండ్ చేయండి. లేదంటే లేదు..  

ఇక్కడి నుంచి బాగా బీచ్ కి వెళ్ళండి బీచ్ నైట్ లైఫ్కి చాలా ఫేమస్  నైట్ క్లబ్స్ ఉంటాయి,   టైమింగ్స్ ఈవినింగ్ 6  నుంచి మార్నింగ్ 4 వరకు ఉంటాయి.. 

 నైట్ క్లబ్ కీ మీరు వెళ్లకపోయినా మొత్తం తీతవోస్ లైన్ మొత్తం  తిరిగి చూడండి. 

 ఇక్కడ కల్చర్ నీ ఎక్స్పీరియన్స్ చేయండి.. 




DAY 2 ఇన్ గోవా 



ముందుగా  ఆగుడా  ఫోర్ట్  మస్ట్ విసిట్ ప్లేస్ ఇక్కడ చాలా మూవీ షూటింగ్ జరిగినీ.. 

 ఈ ప్లేస్ కవర్ చేశాక రేస్ మగోస్ ఫోర్ట్ కీ వెళ్ళండి. ఈ ఫోర్ట్ ఉన్న లొకేషన్ చాలా బాగుంటుంది. 




 ఆ ప్లేస్ ఆయకా ఫౌంటెనస్ అనే ఏరియా  ఉంటుంది.. ఇకడా  అన్ని ఇల్లు లు  200 ఇయర్స్ ఓల్డ్ ఇల్లు లు  కూడా పూర్తిగా పోర్చుగల్  స్టైలు నిర్మించారు. 
 ఈ ప్లేస్ యూరోప్ కంట్రీ లో ఉన్న ఫీలింగ్ కలుగుతుంది..  ఎట్టిపరిస్థితుల్లో మిస్ అవకండి..  



అది  చేసాక ఓల్డ్ గోవాలోని యునెస్కో వరల్డ్ హెరిటేజ్ సైట్స్ చూద్దాం..  

తారువతా  శ్రీ మంగేష్ ఈ టెంపుల్ గోవా లో  మనం కవర్ చేసే టెంపుల్ ఇదొక్కటే.. 

అనీ  కవర్ చేశాక మనం ఓల్డ్ గోవా ప్లస్ రివర్ క్రూయిజ్ కవర్ చేద్దాం.. 

 రివర్ క్రూయిజ్ అంటే చాలా కాస్ట్లీ అనుకుంటారూ 300 మాత్రమే....  ఈ ట్రిప్ ఒక గెంటా  ఉంటుంది తప్పకుండా వెళ్ళడానికి ట్రై చేయండి. డే టు కంప్లీట్ అయింది.. 


DAY 3 ఇన్ గోవా.....


  మనం దూద్ సాగర్ వాటర్ ఫాల్స్ చూదాం.. ఈ దూద్ సాగర్ వాటర్ ఫాల్ కవర్ చేయటానికి మనకి  2  ఆప్షన్స్ ఉన్నాయి. ఒకటి  ప్యాకేజీ ద్వారా లేదంటే మనం సొంతం గా వెలటం..




 ప్యాకేజీ కాస్ట్ 1500 నుంచి 1500 ఉంటుంది. ఈ ప్యాకేజీలో స్పైస్ ప్లాంటేషన్ విత్ బ్రేక్ ఫాస్ట్ ఉంటాయి  దినినీ  ఆన్లైన్లో బుక్ చేసుకోవచ్చు, లేదంటే బీచ్ దగ్గర్లో ఉన్న ఏజెంట్స్ దగ్గర బుక్ చేసుకోవచ్చు. ఈ  ప్యాకేజి బుక్ చేసుకునే ముందు ఒకసారి కన్ఫాం చేసుకోండి. దీంట్లో స్పైస్ ప్లాంటేషన్ ఇంక్లూడ్  అయిందా లేదా అని.. 


అదే మనం డైరెక్ట్ గా వెళ్ళాలి అంటే కులాం అనే విలేజ్ వరకు వెళ్లాలి ఇది  
కలన్గుటే నుంచి
 80 కిలోమీటర్లు ఉంటుంది. ఈ కులాం విలేజ్ నుంచి దూద్ సాగర్ వాటర్ ఫాల్స్ 12 కిలోమీటర్స్ ఉంటాయి.  ఓన్లీ గవర్నమెంట్ జీపస్  మాత్రమే ఉంటాయి. వీళ్ళు ఒకరికి 600 చార్జి  చేస్తారు జీప్ కీ  500 లైఫ్ జాకెట్ కీ 50 ఎంట్రీ ఫీ  50 రుపీస్.

 

తిరుగు ప్రయాణం......


 ట్రైన్స్ ఏవి ఉన్నాయి..?  

గోవా టు హైదరాబాద్ ట్రైన్ కాచిగూడ ఎక్స్ప్రెస్ ట్రైన్ నెంబర్ 18048 ప్రతి ఆదివారం,మంగళవారం,గురువారం,శుక్రవారం ఉంటుంది. మాడగో జంక్షన్ లో  7 గంటలకు ఉంటుంది ఇదీ నెక్స్ట్ డే మార్నింగ్  కాచిగూడ కి 5 గంటలకి వొస్తుంది. 

 ఇంకొక ట్రైన్  వాస్కోడిగామా హైదరాబాద్ ఎక్స్ప్రెస్ ట్రైన్ నెంబర్ 17022 ఈ  ట్రైన్ ఓన్లీ ఫ్రైడే మాత్రమే ఉంటుంది. ఇది మాడగో లో  09:35 కీ బయలుదేరుతుంది  నెక్స్ట్ డే మార్నింగ్ సికింద్రాబాద్ కి 07:00 ఓ క్లాక్ కి రీచ్ అవుతుంది. 

గోవా నుంచి విజయవాడ , వైజాగ్ కీ ఉనా ట్రైన్ అమరావతి ఎక్స్ప్రెస్ ట్రైన్ నెంబర్ 18048 ఈ ట్రైన్ ప్రతి ఆదివారం మంగళవారం గురువారం శుక్రవారం ఉంటుంది. మాడగో లో 07:50 కీ  బయలుదేరుతుంది, విజయవాడకి నైట్ 02:45 వస్తుంది. నెక్స్ట్ డి  మార్నింగ్ 7:30 కి విశాఖపట్నం చేరుకుంటుంది. 

గోవా టూ తిరుపతి  ట్రైన్    వాస్కోడిగామా తిరుపతి ఎక్స్ప్రెస్ ట్రైన్ నెంబర్ 17420 ఈ ట్రైన్ ఓన్లీ ఫ్రైడే మాత్రమే ఉంటుంది 9:35 కి బయల్దేరుతుంది నెక్స్ట్ డే  మార్నింగ్ 04:00 కీ చేరుకుంటుంది.. 




నోట్ : కొన్ని ఫోటోస్  ఓన్లీ రిఫరెన్స్ కోసం పెట్టడం జరిగింది 

కామెంట్‌ను పోస్ట్ చేయండి

0 కామెంట్‌లు