చాలా మంది డాక్టర్లు అసలు తీపి మొత్తానికి మానేయాలి అని చెప్తుండగా మారి కొందరు డాక్టర్ లు కొన్ని రకాలు పండులని తినమని సూచిస్తూ ఉంటారు.
అయితే పండ్లు తినచ్చ లేదా అంటే ఒక అధ్యయనంలో ఎం తేలింది అంటే,పండ్లు తినడం వల్ల వచ్చే నష్టం కన్న పండ్లు తినడం వల్ల వచ్చే లాభాలే ఎక్కువ అని తేలింది.ఇపుడు సుగర్ కంట్రోల్ లో ఉండడానికి ఆరోగ్యంగా ఉండడానికి ఉపయోగ పడే 10 పండులు గురించి తెలుసుకుందాం.
1.దానిమ్మ:
దానిమ్మ పండును తినడం వల్ల సుగర్ వ్యాధి తో బాధ పడేవారికి చాలా ప్రయోజనాలు ఉన్నాయి.
శరీరం లో ఉండే చెక్కర నిల్వలను మెరుగు పరచడానికి ఎంతో బాగా ఉపయోగ పడుతుంది.కాబట్టి సుగర్ బాధ తో బాధ పడే వారికి ఈ పండు ఎంతగానో ఉపయోగ పడుతుంది,కాబట్టి ఈ పండు ని అందరూ చక్కగా తినవచ్చు.
2.యాపిల్:
యాపిల్ పండు తినడం వల్ల చాలా ఉపయోగాలున్నాయి.
మనం చాలా చోట్ల చదివి ఉంటాం.ఒక యాపిల్ తిని డాక్టర్ ని దూరం పెట్టండి అని,ఆ మాట నిజమే.యాపిల్ లో విటమిన్ సి,యాంటీ ఆక్సిడెంట్స్ పుష్కలంగా ఉంటాయి.మరియు ఈ పండు మన శరీరం లో ఉండే విషపూరితమైన ద్రవాలను తొలగించడానికి చాలా బాగా ఉపయోగ పడుతుంది.
3.నారింజ పండు:
ఈ నారిన్జజపండులో థయామిన్ వంటి పోషకాలు చాలా ఎక్కువగా ఉంటాయి.నారింజ పండు వల్ల బరువు తగ్గడం కూడా సాధ్యం అవుతుంది.సుగర్ వ్యాధి ఉన్నవాళ్లు ఎటువంటి బాయం లేకుండా ప్రతి రోజు ఒక పండు ని తినచ్చు.
4.పైన్ యాపిల్:
ఈ పైన్ యాపిల్ పండులో యాంటీ వైరల్ మరియు ఇన్ఫ్లమేటరీ లక్షణాలు ఎక్కువగా ఉంటాయి.ఆ లక్షణాలు ఎక్కువగా ఉండడం వల్ల సుగర్ వ్యాధి తో బడ పడుతున్న వారికి చాలా ఉపయోగ పడుతుంది.దీనిని రిస్కఒడం వల్ల ఎటు వంటి ప్రమాదం ఉండదు అని తేలింది.కాబట్టి సుగర్ వ్యాధి వల్ల బాధ పడే వారు భయపడకుండా,పైన్ యాపిల్ పండు ని తిస్కోవచ్చు.
5. ఉసిరకాయలు
ఉసిరికాయ లో విటమిన్ సి ఎక్కువగా ఉంటది అని మన అందరికీ తెలుసు.ఆ విటమిన్ సీ ఎంతగానో ఉపయోగ పడుతుంది.
ఉసిరి కాయ లో ఫైబర్ కూడా చాలా ఎక్కువ గా ఉంటుంది.ఉసిరి కాయ సుగర్ వ్యాధి వాళ్ళకి చాలా అనుకూలంగా ఉపయోగ పడుతుంది.
6.పుచ్చకాయ:
పుచ్చకాయ తినడం వల్ల చాలా లాభాలు ఉంటాయి.దీనిలో అధికశాతం లో నీరు ఉంటుంది.
అధికంగా నీరు ఉండడం వల్ల మన శరీరం లో నీరు శాతం మంచిగా ఉంటది.సుగర్ వ్యాధి ఉన్న వాళ్ళు రోజుకి 2 ముక్కలు పుచ్చకాయ తినచ్చు.
7.జామకాయ:
జామకాయ లో ఉండే అధిక ఫైబర్ వల్ల సుగర్ వ్యాధి ఉన్న వాళ్ళకి చాలా ఉపయోగాలు ఉన్నాయి.జామకాయ తినడం వల్ల అందులో ఉండే ఫైబర్ మనం తిన్న ఆహారాన్ని త్వరగా అరిగే ల చెయ్యదు.అల చెయ్యకపోవడం వల్ల సుగర్ మన రక్తం లో వెంటనే చేరద.జామకాయ సుగర్ ఉన్న వాళ్ళకి బానే ఉపయోగ పడుతుంది.
8. కివి పండు:
దీనిలో ఉండే యాంటీ ఆక్సిడెంట్స్ మన శరీరం లో ఉండే విషపదరదలని సురక్షితంగా తీసేస్తుంది.ఈ కివి పండు లో ఫైబర్ కూడా ఎక్కువే ఉంటుంది.ఈ పండు చలి కాలం లో మంచిది.
9.నేరేడు పండు:
సుగర్ వ్యాధి తో బాధ పడుతున్న వారికి నేరేడు పండు చాలా బాగా ఉపయోగ పడుతుంది.ఈ నేరేడు పండు లో యాంటీఆక్సిడెంట్స్ మరియు ఫైబర్ ఎక్కువగా ఉంటుంది.ఎవి సుగర్ వ్యాధి తో ఉన్న వాళ్ళకి చాలా బాగా ఉపయోగ పడుతుంది.
10. స్త్రాబెర్రీ:
సుగర్ వ్యాధి ఉన్న వాళ్ళకి స్ట్రాబెర్రీ చాలా బాగా ఉపయోగ పడుతుంది.కేలరీలు మరియు కెర్బ్స్ బెర్రీస్ లో ఎక్కువ ఉండవు.ఈ పండు బరువు తగ్గడానికి కూడా చాలా బాగా ఉపయోగ పడుతుంది.
సుగర్ వ్యాధి ఉన్న వాళ్ళు తీపి పదార్ధాలని తక్కువ తిస్కొడం ఉత్తమం.
సుగర్ వ్యాధి ఉన్నవాళ్లు డ్రింక్స్ కి తీపి పదార్ధాలని చాలా దూరం పెట్టాలి.అలాంటి వాటికి అస్సలు అలవాటు పడకూడదు.ఎందుకంటే సుగర్ కేవలం ఆరోగ్యాన్ని పడు చెయ్యడానికి తప్ప దేనికి ఉపయోగ పడదు.కాబట్టి అందరూ సుగర్ వాడటం తగ్గించాలి.అల తగ్గించకపోతే ఒక వయసు వచ్చే పటికి చాలా ఇబ్బంది పడాల్సి వస్తది.దయ చేసి ప్రతీ ఒకళ్ళు సుగర్ ని వాడటం తగ్గించాలి.లేదంటే చాలా ఇబ్బందులు పడలిస్ వస్తది.
సుగర్ ఉన్న వాళ్ళు ప్రతీ నెల కచ్చితంగా సుగర్ ని చూసుకోవాలి.సుగర్ లెవెల్ బట్టీ టాబ్లెట్ లు వేసుకోవాలి.అల వాడకపోతే ఏమన్నా చిన్న దెబ్బలు తగిలిన చాలా పెద్ద ప్రమాదాలు అవుతాయి.కాబట్టి అందరూ సుగర్ ఉన్న వాళ్ళు చాలా జాగ్రత్త గా అన్నీ అతి తుచి తినండి.మీరందరూ ఆరోగ్యం గా ఉండాలి అని కోరుకుంటున్నాను.మానం ఆరోగ్యంగా ఉంటేనే మన సమాజం కూడా ఆరోగ్యంగా ఉన్నట్లు.కాబట్టి చెడు తిండులకు అలవాటు మానుకొని చక్కగా ఆహారం తీస్కుని ఆరోగ్యంగా ఉండండి.మనం ఆరోగ్యంగా లేకపోతే మన ఇంట్లో వాళ్ళు కూడా చాలా బడ పడాల్సి వస్తుంది అందరూ ఆనందంగా ఉండాలి అంటే ఆరోగ్యం చాలా ముఖ్యం.డబ్బు ఎంత ఉన్న ఆరోగ్యం లేకపోతే ఏమి చెయ్యలేము అది మనసులో పెట్టుకోండి.

0 కామెంట్‌లు