మీరు పై ఫోటో లో చూస్తున్నా వ్యక్తి పేరు సౌరబ్ కీర్ పాల్.ఇతను ఒక "గే".గే అంటే ఎవరో మీ అందరికీ తెలుసు.మన చుట్టూ ఉండే గవర్నమెంట్ అధికారులని చూస్తూ ఉంటాం,అందులో అందరూ మగవారు లేదా ఆడవారు ఉంటారు.కానీ కొన్ని రంగాలలో ఈ మధ్య చాలా మంది ట్రాన్సగెండర్లు నీతి గా నిజాయితీగా చదువుకుని పెద్ద స్థాయి అధికారులుగా మారుతున్నారు.ఇప్పుడు కీర్ పాల్ అనే వ్యక్తి ఒక సీనియర్ లాయర్.ఇయన మాజీ సీ.జే.ఐ బీఎన్ కీర్ పాల్ కుమారుడు.అయితే సుప్రీం కోర్ట్ ఒక అరుదైన నీర్ణయం తిస్కుంది.సీనియర్ లాయర్ మరియు గే అయిన సౌరబ్ ని ఢిల్లీ హై కోర్ట్ జడ్జ్ గా సిఫార్సు చేసింది.2017 లో విదేశీ రాయబార కార్యాలయం లో పని చేస్తున్న ఒక వ్యక్తి ని తన జీవిత భాగస్వామిగా చేసుకున్నాడు.ఈ విషయం విన్నాక చాలా మందికి దైర్యం వస్తుంది.ఒక మంచి స్థానం లో ఉండాలి అంటే సంకల్ప బలం ఉంటే చాలు జెండర్ తో పని లేదు అని.ఇలానే మన దేశం లో చాలా మంది హిజ్రా లు గే లు ఎన్నో రంగాల్లో చాలా పెద్ద స్థాయి ని చేరుకున్నారు.మన దేశం లో చాలా మంది హిజ్రా లు రైళ్ళల్లో అడుక్కొడం అలానే వ్యబిచరం లాంటి పనులు చెయ్యడం చేస్తూ ఉంటారు.అలాంటి వాళ్ళకి మన దేశం లోనే చాలా మంది గే లు ఎంతో పెద్ద స్థాయి లో ఉన్న వాళ్ళు ఉన్నారు,వాళ్ళని చూసి ఇలాంటి వాళ్ళు సిగ్గు తెచ్చుకుని,మిగతా వాళ్ళు కూడా వాళ్ళలా ప్రయత్నించాలి.రాబోయే రోజుల్లో సినిమా థిఏటేర్స్ లో పబ్లిక్ టాయ్లెట్లు లో మగ,ఆడ,హిజ్రా అని కూడా వచ్చేస్తే అనుకుంటున్న.చాలా మంది కళ్ళు చేతులు లేని వాళ్ళు కూడా ఎంతో కష్టపడి గొప్ప స్థాయి కి వస్తున్నారు.అలాంటి వాళ్ళని ఆదర్శంగా తీస్కుని.పని చేసే ఓపిక ఉన్న వాళ్ళు అడుక్కోడం మానేసి,పని చేసుకుని బ్రతికితే చాలా బావుంటుంది.
మొట్టమొదటి ట్రాన్స్ జెండర్ జడ్జ్ ఎవరు సత్య శ్రీ షర్మిల,తను ఆ స్థాయి కి రావడానికి చాలా కష్టపడింది,ఆ కష్టానికి ఫలితంగా ఇండియా లోనే మొట్ట మొదటి ట్రాన్స్ జెండర్ జడ్జ్ గా పేరు సాధించింది.

0 కామెంట్‌లు