బాలల దినోత్సవం గురించి తెలుసుకుందాం
సహజం గా మనకి తెల్సిన బాలల దినోత్సవం అంటే నవంబర్ 14 న స్కూల్ కి వెళ్తే టీచర్లు జవహర్లాల్ నెహ్రూ గారి గురించి చెప్పి మిక్చర,స్వీటు, ఇస్తారు అంత వరకే తెలుసు.అసల బాలల దినోత్సవం ఎప్పుడు మొదలైంది,అసల దిని కథ ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం. బాలల దినోత్సవం మొట్ట మొదటిసారిగా 1954లో ప్రారంభించారు.1959 లో ఈ బాలల దినోత్సవం ప్రతీ ఒక్కలు జరుపుకోవాలని ఆదేశం ఇచ్చింది.ఇవన్నీ ఇలా ఉండగా జవహర్లాల్ నెహ్రూ గారి పుట్టిన రోజునే ఈ బాలల దినోత్సవం జరుపుకోడానికి కొన్ని కారణాలు ఉన్నాయి.అవి ఎంతో ఇప్పుడు చూద్దాం.
అప్పట్లో జవహర్లాల్ నెహ్రూ గారి భారత ప్రధాని,
నెహ్రూ గారికి పిల్లలంటే చాలా ఇష్టం.నెహ్రూ గారు పిల్లలతో చాలా చక్కగా ఆనందంగా ఉండే వాడు.ఆయనకి పిల్లలతో ఉన్న బందన్ని గుర్తు చేసుకుంటూ ఆయన పుట్టిన రోజున బాలల దినోత్సవం జరుపుకుంటారు.పిల్లలందరూ నెహ్రూ గారిని ఎంతో ప్రేమగా చచ నెహ్రూ అని పిలిచే వారు.
ఈ బాలల దినోత్సవం అంతర్జాతీయ పండుగ,కానీ ఇది ఒకొక్క దేశం లో ఒకొక్క రోజున జరుగుతుంది,అన్ని దేశాల్లో మన దేశం ల నవంబర్ 14 న జరగదు.
బాలల దినోత్సవం న చిన్నప్పుడు ఎలా జరిగేదో చూడండి
నవంబర్14 బాలల దినోత్సవం అయితే మ స్కూల్ లో 13 నుంచే హడావిడిగా ఉండేది.ప్రతీ క్లాస్ లో కొంత మంది పిల్లల్ని ఏమన్నా డ్రామా గాని జాతీయ పాటలతో డాన్స్ లు గాని వేపించడానికి తయారు చేసేవారు.కొన్ని మంది పిల్లల్ని జవహర్లాల్ నెహ్రూ గారి గురించి చెప్పమని వాళ్ళకి ట్రైనింగ్ ఈచ వాళ్ళు,ఆరోజున అల గడిచిపోయేది.అందరం చక్కగా అన్ని నేర్చుకుని నవంబర్ 14 న తరికున మంచి బట్టలు వేసుకుని స్కూల్ కి వెళ్ళే వాళ్ళం.స్కూల్ కి వెళ్ళిన తరువాత అన్ని ప్రోగ్రామ్స్ జరిగేవి,మ టీచర్లు నెహ్రూ గారి గురించి ఎంతో గొప్ప గా చెప్పేవారు,అవి మేము ఎంతో శ్రద్ధగా వినేవాళ్ళం.స్కూల్ లో ఫంక్షన్ అయిపోయాక క్లాస్ లకు వెళ్ళే వాళ్ళం.అయితే ఆరోజంతా చాలా ఆనందంగా గడిచి పోయేది,ఎందుకంటే ఆ రోజు స్కూల్ లో ఒక్క టీచర్ కూడా మమ్మల్ని కొట్టే వాళ్ళు కాదు,ఎందుకంటే పిల్లల దినోత్సవం కాబట్టి.చాలా సరదాగా ఉండేది చిన్నతనం లో కానీ కొందరు పిల్లలు స్కూల్ కి వెళ్ళాలంటే ఏడుస్తారు.స్కూల్ వదిలి వెళ్ళాక తెలుస్తుంది బాధ.అందరికీ బాలల దినోత్సవ శుభకాంక్షలు.
మరి కొన్ని జాతీయ పండగల గురించి ఇప్పుడు తెలుసుకుందాం
స్వాతంత్ర దినోత్సవం:
స్వాతంత్ర దినోత్సవం అనగానే మనకి గుర్తొచ్చే వ్యక్తి గాంధీజీ.ఎందుకంటే మనకి స్వాతంత్రం రావడానికి ముఖ్య కారణం గాంధీజీ.మహాత్మా గాంధీ గారు మనకి స్వాతంత్రం తిస్కురావలి అని ఎన్ని యుద్ధాలు శాంతి పూర్వకంగా చేశారు.గాంధీ గారు తో కష్ట పడిన ఎందరో ఫ్రీడమ్ ఫైటర్స్ మనకి ఈ స్వాతంత్రం నీ తెచ్చి పెట్టారు.స్వాతంత్ర దినోత్సవం మన భారత దేశానికి ఒక జాతీయ పండుగ.ఈ పండుగ రోజున ఎం చేస్తారో ఇప్పుడు చెప్తా వినండి.స్వాతంత్ర దినోత్సవం భారత దేశం లో ఉన్న ప్రతీ భారతీయుడు జరుపుకునే ముఖ్య పండుగ.ఈ పండుగ అందరికన్నా బాగా పిల్లలు జరుపుకుంటారు.ఈ పండుగ నాడు పిల్లలందరూ పాటశాలలో జండ వందనం చేస్తారు.జంద వందనం అయ్యాక స్కూల్ లోని టీచర్లు స్వాతంత్రం ఎలా తెచ్చారు.స్వాతంత్రం రావడానికి ఎన్ని మంది ఫ్రీడమ్ ఫైటర్స్ చనిపోయారు,ఆ చనిపోయిన వారి కథలు ఎన్నో చాలా అద్భుతంగా చెప్తారు.అది విన్నప్పుడు చాలా కృతంఙ్ఞత కలిగివుండాలి మన ఫ్రీడమ్ ఫైటర్స కి అనిపిస్తుంది.
గాంధీ జయంతి
గాంధీ అంటే తెలియని భారతీయుడు ఉండడ.పైన చదివిన విధంగా గాంధీ గారు ఎన్నో రోజులు ఉప్పు సత్య గ్రహం లాంటి ఎన్నో తీవ్ర యుద్ధాలు చేశారు.ఆయన ఆ నాడు ఆ విధంగా చెయ్యబట్టే,
మనం ఈ రోజు ఇంత స్వేచ్ఛ గా మన భారత దేశం లో ఉండగలగుతున్నం.గాంధీ గారు పుట్టింది అక్టోబర్ 2,ఆయన పుట్టిన తేదీన గాంధీ జయంతి గా పండుగ జరుపుకుంటాం.గాంధీజీ చేసిన యుద్ధాలు అన్ని సత్యం అహింస అనుకుంటేనే జరిగాయి.ఆయన ఎటువంటి రక్తపాతం లేకుండా ఎంతో శాంతిగా మనకి స్వాతంత్ర్యాన్ని తెచ్చి పెట్టారు.అలాంటి గాంధీ గారిని మనం ఎన్ని జన్మలు ఎత్తినా మర్చిపోమూ,పిల్లలు మర్చిపోకుండా ఉండాలి అని కూడా ప్రతీ ఏడాది తపని సరిగా జాతీయ పండుగలు అన్ని చేస్తారు.
గణతంత్ర దినోత్సవం
గణతంత్ర దినోత్సవం అంటే ఇప్పటికి చాలా మందికి సరిగ్గా తెలీదు.గణతంత్ర దినోత్సవం అంటే భారత రాజ్యాంగం అమలులోకి వచ్చిన రోజు.1950 లో భారత ప్రభుత్వ చెట్టానికు బదులు గా భారత రాజ్యాంగాన్ని అమలులోకి తెచ్చారు.ఆరోజున మనం గణతంత్ర దినోత్సవం గా జరుపుకుంటాం.మన భారత దేశాన్ని బ్రిటిష్ వాళ్ళు పాలించారు,వాళ్ళ పరిపాలనా లో బ్రిటిష్ వల్ల రూల్స్ నే అందరూ పాటించలి.కానీ స్వాతంత్రం వచ్చిన తరువాత మన భారతీయులు ఒక రాజ్యాంగాన్ని సృష్టించి దానిని అమలులోకి తెచ్చారు.ఆ రోజునే గణతంత్ర దినోత్సవం గా మనందరం జరుపుకునే పండుగ.ఈ గణతంత్ర దినోత్సవాన్ని జనవరి 26 న జరుపుకుంటాం.
మనం బడి లో చేసుకునే పండగలు పేర్లు తెలుసుకుందాం.
జనవరి నెలలో చేసుకునే పండుగ గణతంత్ర దినోత్సవం.ఇది January 26 na జరుపుకుంటాం.
ఆగస్ట్ నెలలో స్వాతంత్ర దినోత్సవం జరుపుకుంటాం,ఇది ఆగస్ట్ 15 న జరుపుకుంటాం.
సెప్టెంబర్ నెలలో ఉపాధ్యాయుల దినోత్సవం జరుపుకుంటాం.ఇది సెప్టెంబర్ 5న జరుపుకుంటాం.
అక్టోబర్ నెలలో గాంధీ జయంతి,ఇది ఆక్టాబర్ 2 న జరుపుకుంటాం.
నవంబర్ నెలలో బాలల దినోత్సవం ఇది నవంబర్ 14 న జరుపుకుంటాం.
మనం మన భారత దేశం లో ప్రతీ పండుగ ఇలా జరుపుకోవడానికి కారణం,మన భారత దేశ సంప్రదాయాలను మరిచిపోకుండా ఉండాలని,అలానే మన పూర్వీకులు పడిన కష్టాలు గుర్తు తెచ్చుకుంటాం వాళ్ళని పూజించాలి అన్ భావం తో ప్రతీ ఏడాది అస్సలు మర్చిపోకుండా ప్రతీ కార్యక్రమాన్ని చేసుకుంటూ వస్తున్నాము.
మా ఆర్టికల్స్ మీకు నచ్చినట్లయితే వెంటనే కామెంట్ చేసి ప్రోత్సహించండి.
ఈ మా ఆర్టికల్ చదివిన ప్రతి ఒక్కలకి హృదయపూర్వక ధన్యవాదాలు.

0 కామెంట్‌లు