పండ్లు తినగానే ఆ పని చెయ్యకండి:don't do this after eating fruits

పండ్లు మన ఆరోగ్యానికి చాలా ఉపయోగ పడతాయి.మనం ఆరోగ్యంగ ఉండాలంటే కచ్చితంగా రోజుకి ఒక్క పండు అయిన తినాలి.కానీ అవి తినేడప్పుడు కొన్ని పద్దతులు పాటించాల్సిన అవసరం కూడా చాలా ఉంది.    
మనం అందరం చాలా ఇష్టంగా పల్లు తింటూ ఉంటాం,కానీ అవి తిన్నప్పుడు కొన్ని జాగ్రత్తలు తిస్కోవలి.అలానే తిన్న తరువాత  చెయ్యకూడని పనులు కూడా ఉన్నాయి.

 పండ్లు తినగానే చెయ్యకూడని పని

      మనలో చాలా మంది పండ్లు తినగానే మంచి నీరు తగుతం,అల అస్సలు తాగకూడదు.కనీసం 45 నిమషాలు అయిన ఆగాలి అని నిపుణులు చెప్తున్నారు,మరి ఎక్కువగా దాహం వేస్తే కనీసం లో కనీసం 30 నిమిషాలు అయిన ఆగాక తగచ్చు అని చెప్తున్నారు.అల పండ్లు తిన వెంటనే నీరు త్రాగడం వల్ల చాలా అనర్ధాలు జరుగుతాయి అంట,అయితే పల్లు తిన వెంటనే నీరు తాగితే కలిగే నష్టాలేంటి అనేది ఇప్పుడు చూద్దాం.
పండ్లు తినగానే నీరు తాగితే కలిగే నష్టాలు
మీరు గాని పండ్లు తిన్న వెంటనే నీరు తగారు అంటే మనం తిన్న ఆహారాన్ని అరిగే ల చేసే ఎంజైమ్ లు పలచబడతయి.అల ఆ ఎంజైమ్ లు పలచ బడితే,తిన్న ఆహారం జీర్ణం అవ్వడానికి చాలా సమయం పడుతుంది,అల ఎక్కువ సేపు జీర్ణం జరగడం వల్ల ఎసిడిటీ వచ్చే అవకాశాలు ఉన్నాయి.అలానే ఛాతీలో మంట లాంటి సమస్యలు కూడా వస్తాయి.కాబట్టి ఎవ్వరూ కూడా పడ్లు తినగానే నీరు త్రాగడం చెయ్యకండి.
యాపిల్ లో ఉండే గింజలు తింటే మీ ప్రాణానికి ముప్పు
మనం ఎన్నో పండ్లు తింటూనే ఉంటాం వాటితో పాటు కొన్ని సార్లు వాటి గింజ్జలని కూడా తినేస్తుంటం
మరి అలా అని యాపిల్ పండ్ల గింజలు తినచ్చ అంటే కాదు అనే చెప్పాలి.
మనం ఇంగ్లీష్ లో ఒక సామెత విని వుంటాం రోజు ఒక యాపిల్ తింటే డాక్టర్ నీ కలవనవరసం లేదు అని. కానీ అదే యాపిల్ లోనీ గింజలలో మనిషి ప్రాణానికి హాని కలిగించే పదార్థం దాగి ఉంది, అది ఏంటో ఇపుడు తెలుసుకుందాం .
మనం తినే యాపిల్ గింజలో సుమారు 0.6మిల్లీ గ్రాముల హైడ్రోజన్ సైనైడ్ ఉంటుంది.ఒక మనిషి ప్రాణం తీసే శక్తి వీటికి ఉంది.ఒక మనిషి రెండు వందలా యాపిల్ గింజలు తింటే మరణం తధ్యం అని కొన్ని పరిశోధనలు చెప్తున్నాయి.
బొప్పాయి తింటే కలిగే లాభాలు
బొప్పాయి మనం తినే పండ్లు లో ఒకటి,ఈ బొప్పాయి పండు వల్ల చాలా ఆరోగ్య లాభాలు ఉన్నాయి,బొప్పాయి పండు తినడం వల్ల జీర్ణ వ్యవస్థ బాగా పని చేస్తుంది,చర్మం అందంగా కనపడేలా చేస్తుంది, బ్లడ్ క్లొట్స్ ఏర్పడకుండా చుస్కుంటుంది,అలానే గుండె సమస్యలకి కూడా చాలా ఉపయోగ పడుతుంది.
ఎవరికైనా జ్వరాలు టైఫాయిడ్,మలేరియా లాంటి జ్వరాలు వచ్చినప్పుడు వారిలో ప్లేట్ లెట్స్ బాగా పడిపోతాయి,అలాంటి సమయం లో వైద్యులు బొప్పాయి రసం తాగమని సూచిస్తారు,బొప్పాయి లో ఉండే పోషకాలు ప్లేట్ లెట్స్ ను వెంటనే పెంచుతుంది.అల బొప్పాయి పండు చాలా విధాలుగా ఆరోగ్యానికి ఉపయోగపడుతుంది.
జామకాయ ఎంతో మంచిది 
మనందరం జామకాయ కన్న యాపిల్ ఏ ఎక్కువ రేట్ కాబట్టి జామకాయ కన్న యాపిల్ లొనే ఎక్కువ పోషకాలు ఉంటాయ్ అనుకుంటాం,అలా అనుకుంటే పొరపాటే,మీరు చదివింది నిజమే.యాపిల్ కన్న కూడా జామకాయ లో ఎక్కువ పోషకాలు ఉంటాయి.మీరు యాపిల్ ని కొనుక్కొలేకపోతే,జామకాయ ని కోనుకుని తినండి.జామకాయ లో ఎన్నో లాభాలు ఉంటాయి.మీరు ప్రతీ రోజు జామకాయ తినడం వల్ల చాలా ఆరోగ్యంగ ఉంటారు.జామకాయ లో విటమిన్స్ అలానే పీచు పదార్థం ఉండడం వల్ల మనకి ఎంతో ఆరోగ్యాన్ని ఇస్తుంది.జమకాయలలో ఎర్ర జామకాయ అలానే తెల్ల జామకాయ ఉంటాయి,రెండు కూడా ఆరోగ్యానికి ఎంతో లాభాన్ని ఇస్తుంది.
నల్ల ద్రాక్ష తినడం వల్ల కలిగే లాభాలు
    నల్ల ద్రాక్ష ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది.నల్ల ద్రాక్ష లో పొటాషియం ఎక్కువగా ఉండటం వల్ల శరీరం లోని రక్తపోటును తగ్గిస్తుంది.నల్ల ద్రాక్ష తినడం వల్ల అనేక లాభాలు ఉన్నాయి.నల్ల ద్రాక్ష తింటే మన ఒంటిలో ఉండే బ్లడ్ సుగర్ ని అదుపులో ఉంచుతుంది.అలానే గుండె ఆరోగ్యాన్ని చాలా బాగా ఉండేలా చూస్కుంటుంది.కంటీ చూపుని మెరుగుపరుస్తుంది.అలానే క్యాన్సర్కు మంచి ఆయుధం లాగా పనిచేస్తుంది.రోగ నిరోధక శక్తిని పెంచుతుంది.ఇన్ని లాభాలు ఉన్న ద్రాక్షను తినడం వల్ల మనకి ఎంతో మంచి జరుగుతుంది.
అరటి పండు తినడం వల్ల కలిగే లాభాలు
అరటి పండు మన సహజ జీవితం లో చాలా సార్లు తింటాం.ఈ అరటి పండు వల్ల మనకి చాలా లాభాలు ఉన్నాయి.అరటి పండు రోజు తినడం వల్ల మనకి ఎంతో శక్తి గా ఉంటుంది.చాలా మంది వ్యాయామం కి వెళ్ళే ముందు అరటి పండు నే తిని వెళ్తారు.అరటి పండు తినడం వల్ల మలబద్దకం లేకుండా ఉంటుంది.గర్భిణీ స్త్రీ లకు అరటి పండు ఎంతో బాగా పని చేస్తుంది.ఇలా చెప్పుకుంటూ పోతే అరటిపండు కి ఎన్నో వేల ఉపయోగాలు ఉంటాయి.కాబట్టి అందరూ రోజు ఒక అరటి పండు అయిన తినండి,అప్పుడు మీ ఆరోగ్యం ఎంతో బాగా ఉంటుంది.
కర్బుజ తినడం వల్ల కలిగే లాభాలు
    కర్బుజా కాయ తినడం వల్ల ఎన్నో ఆరోగ్య ఫలితాలు ఉన్నవి.వేసవి లో మనం కర్భూజ కాయని ఎక్కువ తింటూ ఉంటాం,చలవ చేస్తుంది అని.కర్భుజ చలవ చెయ్యడం మాత్రమే కాదు,కర్భుజా కాయ లో ఉండే పోషకాలు వల్ల మన ఒంటిలో ఏమన్నా క్యాన్సర్ సెల్స్ ఉంటే వాటిని అనిచివెస్తుందు.కర్భిజ కాయలో తక్కువ కేలరీలు ఉంటాయి,అలానే పీచు పదార్థం ఎక్కువ గ ఉండడం వల్ల బరువు తగ్గించడం లో ఎంతో సహాయ పడుతుంది.కర్భూజా ప్రతీ రోజు తినడం వల్ల చాలా ఆరోగ్య లాభాలు ఉంటాయి.

అన్ని రకాల పల్లు తినడం వల్ల మన ఆరోగ్యం ఎంతో అందం గా ఉంటుంది,అవి ఎలా తినాలో అవన్నీ తెలుసుకొని తినడం వల్ల మనకి ఎలాంటి అనారోగ్యం రాదు.అన్ని విషయాలు తెలుసుకుందం ఆరోగ్యంగా ఉందం.

కామెంట్‌ను పోస్ట్ చేయండి

0 కామెంట్‌లు