మారేడు మిల్లీ ప్రయాణం
మారేడుమిల్లి గాడ్స్ క్రియేషన్,మారేడుమిల్లి ఒక అటవీప్రాంతం చుట్టూ పచ్చదనంతో కూడిన చల్లని వాతావరణం .ప్రకృతిలో విశ్రాంతి తీసుకోవాలి అనుకునేవారికి ఉత్తమ ప్రదేశం.ముందుగా మనం ఎలా చేరుకోవాలో చూద్దాం.
మారేడుమిల్లి రాజమండ్రి ,భద్రాచలం రహదారిలో ఉంది. రాజమండ్రి నుంచి 84 కిలోమీటర్లు, భద్రాచలం నుంచి 118 కిలోమీటర్లు.రాజమండ్రి నుంచి వచ్చే పనైతే వీలైనంతవరకు రాజమండ్రి మార్నింగ్ చేరుకోండి. అది బస్సు లో అయినా ట్రైన్ లో అయినా ఫ్లైట్లో ,యువర్ ఛాయిస్ .రాజమండ్రి నుంచి మీరు క్యాబ్ తీసుకుని మారేడుమిల్లి చేరుకోవచ్చు .
లేదా బస్సులో వెళ్లాలనుకుంటే రాజమండ్రి నుంచి భద్రాచలం వెళ్లే బస్సు ఎక్కి మనం మారేడుమిల్లి దిగొచ్చు. అదే విధంగా భద్రాచలం నుంచి మారేడుమిల్లి వచ్చేవాళ్ళు భద్రాచలం లో క్యాబ్ తీసుకుని మారేడు మిల్లీ చేరుకోవచ్చు ,లేద భద్రాచలం నుంచి రాజమండ్రి వచ్చే బస్సు ఎక్కి మారేడుమిల్లి లో దిగొచ్చు.మారేడుమిల్లి చేరుకున్నాక అక్కడ ఎక్కడ స్టే చేయాలి.
ఇల్లు ,ప్రైవేట్ హోటల్ గాని రిసార్ట్ గాని లేవు ఇక్కడ గవర్నమెంట్ రిసార్ట్స్ మాత్రమే ఉన్నాయి. అవి కూడా ఆంధ్రప్రదేశ్ ఫారెస్ట్ డిపార్ట్మెంట్ నిర్వహిస్తుంది.వాటిని వనవిహారం అంటారు. వీటి యొక్క ప్రైస్ నేను స్క్రీన్ పైన ఇస్తాను ఒకసారి చెక్ చేసుకోండి.
వీటిని ఆన్లైన్లో బుక్ చేసుకోవాలి .అన్న లేదంటే డైరెక్ట్ గా వాళ్ళ కాల్ చేసి అడ్వాన్స్ బుకింగ్ చేసుకోవాలన్నా వాటికి సంబంధించిన పూర్తి డిటేల్స్ నేను ఇక్కడ ఇస్తాను క్లిక్ చేసుకోండి.http/:www.vanavihari.com/home వాళ్ళ/ ఫోన్ నెంబర్ అండ్ వెబ్ సైట్ లింక్.ఇప్పుడు ఇక్కడ చూడవలసిన ప్రదేశాలు ఏంటో చూద్దాం
👉మారేడుమిల్లి లో మరియు చుట్టుపక్కల చూడటానికి చాలా ప్రదేశాలు ఉన్నాయి .మీరు కనుక వనవిహార్ లో స్టే చేసినట్లయితే అక్కడ జంగల్ స్టార్ రిసార్ట్ కి తప్పక వెళ్ళండి.అక్కడ పది రూపాయలు ఎంట్రన్స్ టికెట్ ఉంటుంది . ఈ ప్రదేశం చుట్టూ మూడు వైపులా నది ప్రవహిస్తూ అద్భుతంగా ఉంటుంది.
మీరు కనుక పదిమంది అంతకుమించి వచ్చినట్లయితే .ఇక్కడ క్యాంపు ఏర్పాటు చేసుకోవచ్చు.ఇక్కడే స్టే చేయవచ్చు. దీనికి కావలసిన ఏర్పాట్లు అన్నీ ఇక్కడ ఉన్నాయి.
👉మారేడుమిల్లి లో ప్రధాన ఆకర్షణ జలతరంగిణి వాటర్ ఫాల్,
ఈ వాటర్ ఫాల్స్ ఏ కాదు చుట్టూ ఉన్న ప్రదేశం చాలా అద్భుతంగా ఉంటుంది. ఏది మిస్ చేసినఈ వాటర్ ఫాల్స్ అస్సలు మిస్ అవ్వద్దు.
👉 నెక్స్ట్ మదన కుంజ , అడవిలో కి వెళ్ళే దారి లో కనిపిస్తుంది ఇక్కడ పులులు ,అడవి దున్నలు, జింకలు
నెమళ్లు, ఎలుగుబంట్లు చూడొచ్చు. పులులు మాత్రం అరుదుగా కనిపిస్తాయి.
👉తరువాత నందనవనం. ఈ ప్లేస్ ఒక నేచురల్ బ్యూటీ ఇక్కడ మెడిసినల్ ప్లాంట్స్ అవేర్నెస్ సెంటర్ ఉంది.ఏ ప్లాంట్ లో ఔషధగుణాలు ఉన్నాయో తెలుసుకోవచ్చు .దీనికి దగ్గర్లోనే కాఫీ మరియు పెప్పర్ ప్లాంటేషన్ ఉన్నాయి . తప్పకుండా విజిట్ చేయండి. అంతేకాదు ఈ నందనవనం దగ్గర్లోనే మనకి మారేడుమిల్ల ఫేమస్ బాంబు చికెన్ అందుబాటులో ఉంటుంది. తప్పకుండా ట్రై చేయండి.నెక్స్ట్ కార్తీక వణం కార్తీక వణం మొక్కలతో నిండిన ఒక ఆధ్యాత్మిక ప్రదేశంఇక్కడ రావి, వేప,ఉసిరి మరియు విలువ మొక్కలు ఉన్నాయి.ముఖ్యంగా కార్తీక మాసంలో పెద్దఎత్తున వనభోజనాలు నిర్వహిస్తారు.
👉అంతేకాదు మారేడుమిల్లి 8 కిలోమీటర్ల దూరంలో స్వర్ణదర అమృతధార అనే రెండు జలపాతాలు ఉన్నాయి.ఇక్కడ ఎండాకాలంలో కూడా నీరు ఉంటుంది. ఇలా మారేడుమిల్లి పూర్తిచేసుకున్న తరువాత.
👉మారేడుమిల్లి కి 15 కిలోమీటర్ల దూరంలో రంపచోడవరం ఉంది.మారేడుమిల్లి నుంచి రాజమండ్రికి వెళ్ళే దారిలో ఉంటుంది. కాబట్టి రిటర్న్ లో దీనిని తప్పక విజిట్ చేయండి .ఇక్కడ చూడవలసిన ప్రదేశాలు రంప వాటర్ ఫాల్స్.
👉పురాతన శివాలయం.
ఈ ఆలయంలోని అల్లూరి సీతారామరాజు పూజలు చేసేవారు అని చెబుతారు. తరువాత రాజమండ్రి కి చేరుకొని అక్కడి నుంచి మీ నేటివ్ ప్లేస్ కి చేరుకోవచ్చు.

0 కామెంట్‌లు