కాశీ యాత్ర గురించి పూర్తి సమాచారం తెలుసుకుందాం.. కాశీ ఎలా చేరుకోవాలి..? కాశీ లో తప్పకుండా చూడవలసిన ప్రదేశాలు, కాశీలో ఎక్కడ స్టే చేయాలి..?
కాశి ఎలా చేరుకోవలో చూద్దాం కొంచెం మనీ ఎక్కువ అయినా పర్వాలేదు టైం కావాలి అనుకునే వాళ్ళకి బెస్ట్ ఆప్షన్ ఫ్లైట్లో వెళ్ళటం హైదరాబాద్ , విజయవాడ , వైజాగ్ , తిరుపతి నుంచి వారణాసికి డైరెక్టర్ ఫ్లైట్ కనెక్టివిటీ ఉంది. ఎవరైతే కొంచెం టైం తీసుకున్నా పర్వాలేదు బడ్జెట్లో వెళ్ళాలి అనుకునే వాళ్ళకి రైల్వే బెస్ట్ ఆప్షన్. ముందుగా హైదరాబాద్ చేరుకోండి హైదరాబాద్ నుంచి కాశి కి వెళ్లే ట్రైన్ నెంబర్ 12791 ఇది సికింద్రాబాద్ లో ఉదయం 10 గంటలకు బయలుదేరుతుంది నెక్స్ట్ డే మధ్యాహ్నం 2:30 కు కాశీ చేరుకుంటుంది...
కాశీ చేరుకునం మరీ కాశీ లో స్టే ఏకడా చేయాలి..?
కాశీలో ఎక్కడ స్టేజ్ చేయాలో చూద్దాం. కాశీలో తెలుగు వాళ్ళు స్టే చేయడానికి ఉన్న బెస్ట్ ఆప్షన్ తారకరామ ఆంధ్ర ఆశ్రమం ఇక్కడ ఆన్లైన్బుకింగ్ ఉండదు, మీరు వెళ్ళినప్పుడు రూమ్స్ ఖాళీ ఉంటే ఇస్తారు లేదంటే లేదు. కాబట్టి వీటిపై ఆధారపడకండి. కాశీలో అస్వీ గాట్ ఉన్న ఏరియా చాలా బాగుంటుంది. ఈ ప్రదేశంలో 300 నుంచి 2000 వరకూ హోటల్స్ అందుబాటులో ఉన్నాయి. ఆన్లైన్లో బెస్ట్ రేటింగ్ ఉన్న వాటిని బుక్చేసుకోండి.
కాశీ లో మనం తపకుండా చూడవాలిసిన ప్రేదేశాలు ఏంటి..?
కాశి లో తప్పక చూడవలసిన ప్రదేశాలు ఏంటో డేస్ వైస్ గా చూద్దాం.....
మోదటిరోజు....
మొదటిరోజు మనం మధ్యాహ్నం 2:30 కు ట్రైన్ దిగి హోటల్ తీసుకొని లంచ్ చేసి రెస్ట్ తీసుకొని ఫ్రెష్ అవే లోపే 4:30 అయిపోతుంది. కాబట్టి సాయంత్రం 5 కల్లా దశాశ్వమేధా ఘాట్ చేరుకోండి.
గంగ హారతి నీ బోర్డ్ నుంచి కూడా చూడవచ్చు దీనికి బోర్డు వాళ్ళు 100 నుంచి 200 రూపాయలు తీసుకుంటారు. ఎలా చూడాలనేది మీ ఛాయిస్ గంగా హారతి 45 నిమిషాలు ఉంటుంది.
ఇ హారతి నీ వీక్షించేక వారణాసిలోని చిన్న చిన్న వీధుల్లో తిరుగుతూ వారణాసి కల్చర్ను ఎక్స్పీరియన్స్ చేయండి. రాత్రి భోజనం చేసుకొని వీలైనంత త్వరగా నిద్రపోండి ఇంతటితో మన మొదటి రోజు పూర్తి అవుతుంది.
రెండో రోజు వారణాసి లో
రెండో రోజుఉదయం 5 గంటలకల్లా అస్వీ ఘాట్ చేరుకోండి. ఈ సమయంలో వారణాసి ఘాట్స్ చాలా ప్రశాంతంగా ఆహ్లాదకరంగా ఉంటాయి. అస్వీ ఘాట్ నుంచి దశాశ్వమేధ ఘాట్ వరకు నడుచుకుంటూ మధ్యలో ఉన్న ఘాట్స్ అనీ సందర్శించండి.
తర్వాత తిరిగి అస్వీ ఘాట్ చేరుకొని ఈ ప్రదేశం నుండి సూర్యోదయం చాలా అద్భుతంగా ఉంటుంది. సూర్యోదయం అయ్యాక గంగానదిలో బోట్ రైడ్ కి వెళ్ళండి. ఈ పడవ లో వారణాసిలోని ఘాట్స్ అన్నిటీనీ చూస్తూ ప్రయాణం చేయొచ్చు.
పిండ ప్రధానం చేసేవారు ఘాట్స్ దగ్గరే పూజారులు ఉంటారు. వీరు 800 నుంచి 1000 రూపాయలు తీసుకుంటారు. మనం ఏమీ తీసుకుని వెలలిసిన అవసరం లేదు అన్ని సామాన్లు వాళ్ళే తీసుకువస్తారు.
మీరు ఫ్రెష్ అప్ అయి బ్రేక్ఫాస్ట్ చేసుకుని కాశీ విశ్వనాధుని దర్శనానికి వెళ్ళండి. ఆలయంలోకి మొబైల్ ఫోన్స్ హ్యాండ్ బగ్స్ నీ తీసుకు వెళ్ళనివారు కాబట్టి అన్ని మీ రూమ్ లోనే వదిలేయండి.
నార్మల్ రోజులలో దర్శనానికి రెండు గంటల సమయం పడుతుంది. అదే హాలిడేస్ ఉంటే మినిమం 3 గెంటలు టైం పడుతుంది.
ఈ ఆలయానికి దగ్గరలోనే విశాలాక్షి అమ్మవారు మరియు అన్నపూర్ణా దేవి ఆలయాలు ఉంటాయి. వీటిని కూడా దర్శించుకోండి. ఈ ఆలయలా దర్శనం అయ్యేలోపే మూడు నుంచి నాలుగు గంటల సమయం పడుతుంది.
తర్వాత 1.5 కిలోమీటర్లు దూరం లో ఉనా కాలభైరవ ఆలయానికి వెళ్లండి. ఈ ఆలయం మధ్యాహ్నం 1:30 కి క్లోజ్ చేస్తారు. కాబట్టి టైం వేస్ట్ చేయకుండా త్వరగా వెళ్ళండి.
ఒకవేళ మీరు వెళ్ళే సమయానికి ఈ ఆలయం మూసివేసే నెక్స్ట్ డే ఉదయాన్నే వెళ్ళడానికి ట్రై చేయండి.
ఇప్పుడు మీరు కొంచెం రెస్ట్ తీసుకొని బోజనం చేసుకొని 7 కిలోమీటర్ దూరం లో ఉనా రామ్ నగర్ ఫోర్ట్ కు వెళ్ళండి. ఇది గంగానది ఒడ్డున తులసి ఘాట్ కీ ఎదురుగా ఉంటుంది.. ఇది 1750లో కాశీ నరేష్ రాజా బల్వంత్ సింగ్ నిర్మించారు. ఈ ఫోర్ట్ ఉన్న లోకేషన్ మరియు పోర్ట్ ఆర్కిటెక్చర్ చాలా అద్భుతంగా ఉంటాయి.
ఇ యూనివర్సిటీ ప్రాంగణంలోనే కొత్తగా కాశీ విశ్వనాధ ఆలయం నిర్మించారు తప్పకుండా దర్శనం చేసుకోండి.
మన దేశంలోనే అతిపెద్ద విమాన గోపురాలలో పెద్దది దీని ఎత్తు 250 అడుగులు. తర్వాత స్ధానం లో 216 అడుగుల ఎత్తుతో బొదీశ్వర ఆలయం రెండో స్థానంలో ఉంది.
ఈ ఆలయం దగిరలో కోల్డ్ కాఫీ మరియు ఐస్ క్రీమ్ చాలా ఫేమస్ తపకుండా ట్రై చేయండి.
తర్వాత 2 కిలోమీటర్ డిస్టెన్స్ లో సంకటమోచన హనుమాన్ టెంపుల్ ఉంది. దీనిని ఫేమస్ పొయెట్ తులసి దాస్ 16వ శాతాబ్ధం లో నిర్మించారు.
తరువాత 1 కిలోమీటర్ల లోపే తులసీ మానస మందిరం ఉంది. ఈ ఆలయం ఉన్న ప్రదేశంలోనే తులసీదాస్ గోస్వామి రామచరితమానస్ రచించారు.
తర్వాత 0.3 కిలోమీటర్ డిస్టెన్స్ లో దుర్గాపూర్ సమీపంలోని దుర్గ ఆలయాన్ని దర్శించండి. ఈ ఆలయాన్ని దర్శించాక 4.5 కిలోమీటర్స్ డిస్టెన్స్ లో ఉన్న భారత మాత ఆలయాన్ని దర్శించండి. ఇంతటితో మన డే 2 కంప్లీట్ అవుతుంది.
డిన్నర్ పూర్తి చేసుకొని వీలైనంత త్వరగా నిద్రపోవడానికి ప్రయత్నించండి.
మూడవ రోజు వారణాసి లో..
మూడో రోజు ఎవరైతే కాలభైరవ ఆలయాన్ని దర్శించు కోలేని వారు ఇప్పుడు దర్శించుకోండి. ఇప్పుడు మీ బ్రేక్ఫాస్ట్ కంప్లీట్ చేసుకొని 9 గంటలకల్లా సార్నాధ్ చేరుకోండి.
వారణాసి నుంచి కేవలం 13 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. డైరెక్ట్ గా ఆటో తీసుకోవచ్చు లేదా షేర్ ఆటో కూడా అందుబాటులో ఉంటాయి.
గౌతం బుద్ధునికి బోధి చెట్టు కింద జ్ఞానోదయం అయ్యాక మొట్టమొదటిసారి ఈ సార్నాధ్ లోనే శిష్యులకు ప్రసంగం చేశారు.
శుక్రవారం రోజు ఈ సార్నాధ్ టెంపుల్ మూసివేయబడతుంది.
ఈ ప్రదేశాలన్నీ కవర్ చేసుకొని మధ్యాహ్నం వారణాసి చేరుకొని మీరు కాసేపు రెస్ట్ తీసుకొని లంచ్ కంప్లీట్ చేసుకొని మీ హోటల్ చెక్అవుట్ చేయండి.
ఇప్పుడు కాశీ నుంచి 120 కిలోమీటర్ల డిస్టెన్స్ లో ఉన్న అలహాబాద్లో వెహికల్ తీసుకుని చేరుకోండి . ఇపుడు ఈ ఊరు పేరు ప్రయాగరాజ్ గా మార్చబడింది.
అలహాబాద్ చేరుకునే 10 కిలోమీటర్స్ ముందు బడవహి అనే ప్రదేశంలో సీత సమహిత స్థల అని ఉంటుంది. ఇ ప్రేదేశం లోనే సీతామాత భూమి లోకి ప్రవేశించి తన అవతారాన్ని చాలించింది. ఈ ప్రదేశాన్ని దర్శించేందుకు తపక ప్రయత్నించండి.
తరువాత ప్రయాగ్ చేరుకోండి. ఇకడా తప్పక దర్శించవలసిన ప్రదేశం గంగా యమునా సరస్వతి నదుల త్రివేణి సంగమం. ఇకడికి చేరుకోవాలంటే బోట్ లో వెళ్లాల్సి ఉంటుంది. ఈ బోట్ జర్నీ చాలా అద్భుతంగా ఉంటుంది.
సంఘమా ప్రేదేశం లో స్నానం చేసే వాళ్ళు చేయవచ్చు. ఇక్కడ కూడా మీరు పిండ ప్రేధానం చేయాలంటే 800 నుంచి 1000 రూపాయలు చార్జి చేస్తారు, కావాల్సిన సామాగ్రి మొత్తం వాళ్ళే తీసుకువస్తారు.
తర్వాత దగ్గర్లోనే శక్తి పీఠమైన ఆలోప దేవి మందిరం ఉంది, తపకుండా దర్శించుకోండి.
దగ్గర్లోనే అలహదాబాద్ ఫోర్ట్ ఉంటుంది దీన్ని సాయంత్రం 6 గంటలకు క్లోస్ చేస్తారు, మీకు టైం ఉంటే చూడండి లేదంటే స్కిప్ చేయండి.
అందులో మనకి 08:40 కి సికింద్రాబాద్ ఎక్స్ప్రెస్ ఉంటుంది దీని నెంబర్ 12792 ఈ ట్రైన్ నెక్స్ట్ డే నైట్ 9:30 కి సికింద్రాబాద్ చేరుకుంటుంది. ఇక్కడి నుంచి మీ మీ స్వస్థలనికి చేరుకోండి.
మన రీడర్స్ అందరికీ ఆ కాశీ విశ్వనాధుని దర్శనం త్వరగా ప్రాప్తించలి అని కోరుకుంటూ......
సర్వే జానా సుఖినో భవంతు

0 కామెంట్‌లు