ఏ.సీ జిమ్ లో వర్కౌట్ చేయకూడదా?

         ఏ.సీ జిమ్ లో వర్కౌట్ చేయకూడదా?

కన్నడ పవర్ స్టార్ పునీత్ రాజ్ కుమార్ గారి మరణం అందరినీ ఎంతో బాధ పెట్టింది.ఎప్పటి నుంచో మంచి ఆహారం తిస్కుంటు,చాలా శ్రద్ధ గ వ్యాయామం చేసేవారు,పునీత్ గారికి వయసు 46ఏళ్లు,అంత చిన్న వయసు లో ఒక వ్యక్తి చనిపోతే చాలా బాధ గా ఉంటుంది,అది కూడా జిమ్ చేస్తూ చనిపోవడం చాలా బాధాకరం.అయితే జిమ్ అనేది ఏసీ లో చెయ్యడం మంచిదా కాదా అనే ప్రశ్నలు చాలా మందికి వచ్చాయి.


ఒక మూసేసి ఉన్న జిమ్ లో ఏసీ వేసుకుని జిమ్ చేస్తున్నప్పుడు మన ఒంటి లోంచి వచ్చే వేడి వల్ల ఏయిర్ కండిషన్డ్ వాతావరణం అసౌకర్యంగా మారుతుంది అని నిపుణులు చెప్తున్నారు.ఓపెన్ ప్లేస్ లో జిమ్ చేసుకోడం కుదరనప్పుడు,మూసి ఉన్న జిమ్ లో అయినా ఏసీ వాడకుండా ఉండడం ఉత్తమం.

జిమ్ చేస్తున్న సమయం లో మన ఒళ్ళు చాలా వేడి నీ వదులుతుంది.అలాంటి సమయం లో ఇంకా ఎక్కువ నీరసం వస్తుంది,దానికి అనుగుణంగా ఏసీ వాడటం చాలా అవసరం అని కొంత మంది అంటున్నప్పటికి,దాని వల్ల లాభాల కన్న నష్టాలు ఎక్కువ ఉన్నాయి అని వాదించే వాళ్ళు చాలా మంది ఉన్నారు.

ఏసీ జిమ్ లో ఉండే చల్లదనము వల్ల మనం ఎక్కువ సేపు వర్కౌట్ చేయగలము,మన ఒళ్ళు పెంచే వేడి నీ ఏసీ తగ్గిస్తూ ఉంటది.కానీ ఆ వాతావరణం లో కండరాలు తిమ్మిరి ఎక్కే అవకాశం కూడా ఉంది.


గుండె సమందిత వ్యాధులు ఉన్న వారు నాన్ ఏసీ జిమ్ లో చెయ్యడమే ఉత్తమం.సహజంగా చెమట పట్టి వ్యాయామం చేయడం గుండె సమస్యలు ఉన్నవారికి సరైన పద్దతి.


చర్మ వ్యాధులు,స్కిన్ ఎలర్జీ లాంటి ఇబ్బందులు ఉన్న వాళ్ళు ఏసీ జిమ్ లో చెయ్యడం మంచిది.ఎందుకంటే వ్యయం చేసేటప్పుడు పట్టే చెమట చాలా దురదను చిరకుని తెప్పిస్తుంది,అలాంటి సమయం లో చల్లని గాలి మన చుట్టూ ఉండడం వల్ల మన చర్మానికి హాయి గా ఉంటుంది.

ఆకరిగా చెప్పబోయే మాట ఏది కూడా అతిగా చెయ్యకండి.ఆతి దేనికి మంచిది కాదు.

      జాగ్రత్త గా ఉండండి ఎక్కువ కాలం జీవించండి


కామెంట్‌ను పోస్ట్ చేయండి

0 కామెంట్‌లు