మళ్ళీ పెరిగిన పెట్రోల్ డీజిల్ ధరలు
దేశం లో ప్రతిరోజు పెట్రోల్ డీజిల్ ధరలు పెరిగి సామాన్యుడి గుండెల్లో మంట పుట్టిస్తున్నాయి.ప్రతీ రోజు కనిష్టంగా 0.30పైసలు చొప్పున పెరుగుతూ వస్తుంది,ఇవాళ కూడా డీజిల్ పెట్రోల్ ధరలు 0.35 పైసలు పెరిగాయి.
వివిధ ప్రాంతాలలో పెట్రోల్ మరియు డీజిల్ ధరలు.
హైదరాబాద్:పెట్రోల్ ధర లీటర్ రూ.114.47
డీజిల్ ధర లీటర్ రూ.107.75
విజయవాడ: పెట్రోల్ ధర లీటర్ రూ.116.62
డీజిల్ ధర లీటర్ రూ.109.24
వైజాగ్: పెట్రోల్ ధర లీటర్ రూ.114.42
డీజిల్ ధర లీటర్ రూ.107.73
తాజా పెరుగుదలతో దేశ రాజధాని ఢిల్లీలో లీటర్ పెట్రోల్ రూ.109 క్రాస్ చేసింది. హైదరాబాద్ నగరాల్లో రూ.114 పైనే ఉంది. అక్టోబర్ నెల నుండి లీటర్ పెట్రోల్, లీటర్ డీజిల్ పైన రూ.8కు పైగా పెరిగింది. న్యూఢిల్లీలో లీటర్ పెట్రోల్ రూ.110.04, లీటర్ డీజిల్ రూ.98.42గా ఉంది. ఆర్థిక రాజధాని ముంబైలో లీటర్ పెట్రోల్ రూ.115.85గా ఉంది. డీజిల్ ధర లీటర్ రూ.106.62గా ఉంది. కోల్‌కతాలో లీటర్ పెట్రోల్ రూ.110.49, డీజిల్ రూ.101.56, చెన్నైలో పెట్రోల్ రూ.106.66, డీజిల్ రూ.102.59, హైదరాబాద్‌లో పెట్రోల్ రూ.114.49, డీజిల్ రూ.107.40గా ఉంది. రాజస్థాన్‌లోని గంగానగర్‌లో లీటర్ పెట్రోల్ రూ.122.36, లీటర్ డీజిల్ రూ.112.71గా ఉంది.
ఈ విధంగా ధరలు పెరిగిపోతూ ఉంటే సామాన్య ప్రజలు వాహనాలు వాడడానికి భయపడాల్సిన దుస్తితి వస్తుంది.ఇలా అన్ని ధరలు పెంచుకుంటూ వెళ్లిపోతే ఒక మధ్య తరగతి కుటుంబం ఒక సిటీ లో బతకాలి అంటే కనీసం 50 వెలు నుంచి లక్ష రూపాయలు కావాలి.ఇప్పుడే ఇంత దారుణంగా తయారవుతుంటే,రాబోయే తరాల ఇంకెన్ని కష్టాలు పడతాయో ఊహించుకోవచ్చు.

0 కామెంట్‌లు